గబ్బర్ సింగ్ ని మించి ఉంటుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫిక్స్ చేసుకోగా ఆ తర్వాత వరుసగా ఐదారు సినిమాలు లైన్ లో పెట్టాడు. వకీల్ సాబ్ దాదాపు పూర్తి కాగా క్రిష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమాతో పాటుగా మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ తో రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబోతుందని తెలుస్తుంది. అసలైతే పి.ఎస్.పి.కె 28వ సినిమాగా హరీష్ శంకర్ సినిమా ఉండాల్సింది కాని మధ్యలో రీమేక్ వచ్చేసరికి అది ముందు ముగిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే హరీష్ శంకర్ మూవీ కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని తెలుస్తుంది. సినిమాను గబ్బర్ సింగ్ కాదు అంతకుమించి అనిపించేలా చేస్తున్నాడట హరీష్ శంకర్. తప్పకుండా హరీష్ శంకర్ ఈ సినిమాను అనుకున్న విధంగా గబ్బర్ సింగ్ ను దాటేలా చేస్తాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.