
కె.జి.ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ ప్రశాంత్ నీల్ ను తెలుగు నిర్మాతలు వదలట్లేదు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసేది కూడా మన స్టార్ తోనే అని తెలుస్తుంది. ప్రభాస్ సలార్ పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని టాక్. ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోతో సినిమా చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ స్టామినా మరోసారి చూపించబోతున్నారు. కె.జి.ఎఫ్ 2 హిట్టై.. సలార్ కూడా అంచనాలను అందుకుంటే. తారక్ తో చేసే ఆ ప్రాజెక్ట్ కూడా భారీ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ కూడా పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి లీక్ చేశారు నిర్మాతలు. ఈ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాతలు చెప్పుకొచ్చారు.