రాం చరణ్ తో శంకర్.. దిల్ రాజు మూవీ..!

RRR, ఆచార్య రెండు మెగా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ రెండు సినిమాల తర్వాత మరో భారీ మూవీని ఫిక్స్ చేసుకున్నాడు. కొన్నాళ్లు డిస్కషన్స్ లో ఉన్న కోలీవుడ్ స్టార్ డైరక్టర్ శంకర్ తో రాం చరణ్ మూవీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాఉ దిల్ రాజు నిర్మిస్తున్నారట. ఆచార్యలో సిద్ధ పాత్రలో నటిస్తున్న చరణ్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిపుల్ ఆర్ లో రామరాజు పాత్రలో అలరించనున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ మీద గురి పెట్టాడు. శంకర్ డైరక్షన్ లో భారీ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా చేస్తున్న శంకర్ ఆ సినిమా తర్వాత చరణ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అసలైతే ఇండియన్ 2 సినిమాను కూడా దిల్ రాజు నిర్మించాలని అనుకున్నారు కాని ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. 

ఇక ఇప్పుడు ఫైనల్ గా చరణ్ తో శంకర్ సినిమా ఫిక్స్ చేశాడు. శంకర్, చరణ్ కాంబో మూవీ తెలియగానే మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరన్ పర్ఫెక్ట్ కాంబో ఫిక్స్ చేసుకున్నాడని అనుకుంటున్నారు.