మహేష్ కోసం వేట మొదలు పెట్టిన రాజమౌళి..!

సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు కలిసి త్వరలో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందిచిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ గ్యాప్ లో రాజమౌళి మహేష్ సినిమా పనులు కూడా చూస్తున్నారట. లేటెస్ట్ గా సినిమా కథకు తగినట్టుగా ఫారెస్ట్ లొకేషన్ ను వెతుకుతున్నట్టు టాక్. ఆఫ్రికన్ అడవుల్లో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే మహేష్ తో రాజమౌళి సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ తో రాజమౌళి సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. ఆఫ్రికన్ అడవుల్లో లొకేషన్ సెర్చ్ చేస్తున్నాడు అంటే మహేష్ తో జక్కన్న మరో అద్భుతమైన సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఫిక్స్ అవుతున్నారు.

మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా కన్నా ముందు మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. అది కుదురుతుందా లేదా అనది తెలియాల్సి ఉంది.