
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు అన్ని హంగులు అద్దుతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూస్తున్నారు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అంజలి, నివేదా థామస్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ లో జబర్దస్త్ యాంకర్ రష్మి ఆడిపాడుతుందని టాక్.
ముందు సిల్వర్ స్క్రీన్ పై ప్రయత్నిచి అక్కడ సక్సెస్ అవక బుల్లితెరని నమ్ముకుంది రష్మి గౌతం. జబర్దస్త్ షోతో వచ్చిన క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ మీద కూడా సత్తా చాటుతుంది. గుంటూర్ టాకీస్ లాంటి సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన రష్మి పవర్ స్టార్ వకీల్ సాబ్ లో స్పెషల్ సాంగ్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. అది నిజం అయితే కనుక రష్మి క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ పడితే అమ్మడి పాపులారిటీ మరింత పెరిగె అవకాశం ఉంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.