సుమంత్ 'అనగనగా ఒక రౌడీ'..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత హీరోగా మను యాగ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా అనగనగా ఒక రౌడీ. మంగళవారం సుమంత్ పుట్టినరోజు కారణంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సుమంత్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. సుమంత్ ఎప్పుడూ ప్రయత్నించని ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. టైటిల్ పోస్టరే వర్మ సినిమా మార్క్ టచ్ ఇచ్చినట్టు ఉంది.

అనగనగా ఒక రౌడీ సినిమాలో సుమంత్ వాల్తేరు శ్రీను పాత్రలో నటిస్తున్నాడు. షార్ట్ హెయిర్ కట్, కొద్దిగా గెడ్డం, బొట్టు, బ్లాక్ లుంగీ కాన్ ఫిడెంట్ గా చూపు.. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే హీరో క్యారక్టరైజేషన్ చెప్పకనే చెప్పాడు డైరక్టర్ మను. మళ్లీరావా సినిమాతో కెరియర్ లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న సుమంత్ ప్రయత్నాలు చేస్తున్నాడు కాని వర్క్ అవుట్ అవ్వట్లేదు. లేటెస్ట్ గా సుమంత్ కపటదారి సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజైంది. ఇక ఇప్పుడు సుమంత్ అనగనగా ఒక రౌడీ సినిమా కూడా అలరించనుంది. ఈ సినిమాలో సుమంత్ తన పాత్రతో ప్రేక్సకులను మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు.