
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ తర్వాత సలార్ సినిమా చేస్తున్నాడు. కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ బాహుబలి ప్రభాస్ తో చేస్తున్న క్రేజీ మూవీగా సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కె.జి.ఎఫ్ నిర్మాతలు రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ కోసం ప్రియాంకా చోప్రాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడిన ప్రియంకా బాలీవుడ్ సినిమాలే చేయడానికి ఆసక్తి చూపట్లేదు. అలాంటి ప్రియాంకా చోప్రాని ప్రభాస్ సలార్ కోసం ఒప్పించినట్టు టాక్. బాహుబలితో వరల్డ్ వైడ్ పాపులర్ అయిన ప్రభాస్ తో స్పెషల్ సాంగ్ అనగానే ప్రియాంకా కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తుంది. కె.జి.ఎఫ్ డైరక్టర్.. ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో అని ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ లో నటిస్తాడని టాక్.
స్పెషల్ సాంగ్ అయినా కూడా సలార్ లో ప్రియాంకా ఉంది అంటే సినిమాకు స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే. ప్రస్తుతం సలార్ మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇల్లంది కోల్ మైన్ లో సలార్ షూటింగ్ జరుగుతుంది.