కోలీవుడ్ స్టార్ హీరోకి కరోనా పాజిటివ్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో సూర్యకు పాజిటివ్ రావడం అందరిని షాక్ అయ్యేలా చేసింది. తనకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చిన విషయాన్ని సూర్య స్వయంగా ప్రకటించాడు. మన జీవితాల నుండి కరోనా ఇంకా బయటకుపోలేదు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రస్తుతం నేను కరోనా నుండి కోలుకుంటున్నాను.. నా ఈ టైం లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ సూర్య తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

కోలీవుడ్ హీరో అయినా కూడా సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య కరోనా బారిన పడిన వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాక్ డౌన్ టైం లోనే సూర్య సూరారై పొట్రు సినిమా చేశాడు. ఆ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా అంటూ వచ్చింది. అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.