ప్రేమికుల రోజు రాధే శ్యామ్ కానుక..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్దే పిరియాడికల్ లవ్ స్టోరీగా రాధే శ్యామ్ రాబోతుంది.

ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ రాబోతుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ టీజర్ వాలెంటైన్స్ డే నాడు రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రేముకుల రోజు ప్రభాస్ తన ఫ్యాన్స్ కు అద్భుతమైన కానుక ఇవ్వనున్నాడు. ప్రభాస్, రాధే శ్యాం ఇద్దరి జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది.