నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ సీరియస్ అటెంప్ట్..!

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వస్తున్న సినిమా నాంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించిన అల్లరి నరేష్ సినిమా టీజర్, ట్రైలర్ తోనే మూవీపై అంచనాలు పెంచేశాడు. ముఖ్యంగా నాంది ట్రైలర్ నరేష్ ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ లో ఆడియెన్స్ కు కొత్తగా పరిచయం చేస్తుందని చెప్పొచ్చు. 

నూతన దర్శకుడే అయినా విజయ్ కనకమేడల తన దర్శకత్వ ప్రతిభను.. డైలాగ్స్ తో తన పెన్ పవర్ ను చూపించినట్టు ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసిన నాంది ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. మహర్షి లో మహేష్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి అలరించిన అల్లరోడు ఈమధ్యనే బంగారు బుల్లోడు సినిమాతో నిరాశ కలిగించాడు. నాంది సినిమాతో మాత్రం టార్గెట్ మిస్ అవకుండా వస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆ పాత్రతో ప్రేక్షకులను మెప్పించడంతో వరలక్ష్మి శరత్ కుమార్ కు తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. నాంది సినిమాలో ఆమె లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 19న రిలీజ్ అవుతున్న నాంది అల్లరి నరేష్ కోరుకునే హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.