
క్రికెట్ టీం కు సరిపడేలా టాలీవుడ్ లో మెగా హీరోలు ఉన్నారని చెప్పొచ్చు. హీరోలు, హీరోయిన్లు అదే నిహారికతో కలిపి దాదాపు 10, 11 మంది దాకా ఉన్నారు. త్వరలో వైష్ణవ్ తేజ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో అతను కూడా మెగా బ్యాచ్ లో జాయిన్ అవుతున్నాడు. అందుకే ఓ దర్శకుడు, రైటర్ ఒక కథను తెస్తే చెప్పిన మెగా హీరోకి సూట్ అవ్వకపోయినా మెగా హీరోల్లో ఎవరికో ఒకరికి సెట్ చేసేస్తున్నారు. అలాంటి ఓ క్రేజీ సినిమా న్యూస్ బయటకు వచ్చింది.
ఓ బడా నిర్మాత చిరు, చరణ్ లకు ఓ కథ వినిపించాడట. చరణ్ కోసమే రాసిన ఓ అప్కమింగ్ రైటర్ ఈ కథ చెప్పినట్టు టాక్. అయితే చిరు, చరణ్ లకు కథ నచ్చినా సరే చరణ్ ఇప్పుడున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా చేయడం కుదరదని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఈ కథ బయటకు పోనివ్వకుండా వరుణ్ తేజ్ కు ఫోన్ చేసి కథ వినమని చెప్పాడట. అన్న చెప్పాడని కథ విన్న వరుణ్ డైరక్టర్ చెప్పిన కథకు ఎక్సయిట్ అయ్యాడట. సో అలా చరణ్ కోసం అనుకున్న కథతో వరుణ్ తేజ్ సినిమా ఉండబోతుందని టాక్. వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక చరణ్ రిఫర్ చేసిన సినిమా చేస్తాడని తెలుస్తుంది.