RRR సెట్ లో చరణ్, ఎన్టీఆర్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ తో పాటుగా హాలీవుడ్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ కూడా నటిస్తుంది. క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు పాల్గొంటున్నారని తెలుస్తుంది. రామోజి ఫిల్మ్ సిటీలో ట్రిపుల్ ఆర్ కోసం వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్ జరుగుతుంది.  

షూట్ ప్రాక్టీస్ సెషన్స్ లో తారక్, చరణ్ రిలాక్స్ అవుతున్న టైంలో చిత్రయూనిట్ ఫోటోలను తీసింది. రామరాజు అదే మన రాం చరణ్, కొమరం భీమ్ మన యంగ్ టైగర్ ఇద్దరు రెగ్యులర్ డ్రెస్ లో సెట్ లో సరదాగా కనిపిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సెట్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజమౌళి ఈ సినిమాను బాహుబలిని మించేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో చరణ్, తారక్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపిస్తారని అంటున్నారు.