ఆ హిట్ పాటే రామ్ సినిమా టైటిల్

ఈ సంవత్సరం మొదటి రోజే నేను శైలజ అంటూ తన కెరియర్ లో బెస్ట్ హిట్ అందుకున్న రామ్, లాస్ట్ ఇయర్ తను చేసిన సినిమాలతో చాలా విమర్శలను అందుకున్నాడు.. ఎలా అంటే తనకే వినిపించేంత గట్టిగా విమర్శలు వచ్చాయని రామ్ తనంతట తానే చెప్పేంత అన్నమాట. ఇక తన సినిమాల కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న రామ్, ప్రస్తుతం హైపర్ గా కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్లో వస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమా దసరా బరిలో రిలీజ్ అవుతుంది.

ఇక ఈ మూవీ తర్వాత రామ్ కు కథ చెప్పిన దర్శకుల లిస్ట్ పెద్దదే అయినా ఫైనల్ గా రామ్ కరుణాకరణ్ డైరక్షన్లో సినిమా ఓకే చేశాడు. ఇద్దరి కలిసి ఇంతకు ముందు 'ఎందుకంటే ప్రేమంట' సినిమా చేసినా, ఆ మూవీ ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వలేదు. స్వతహాగా ప్రేమకథల సినిమాలకు స్పెషలిస్ట్ ఐన కరుణాకరణ్, ఈ మధ్య చాలా వెనుకపడ్డాడు. అయితే మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన రామ్ తో ఓ అందమైన ప్రేమ కథ తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా టైటిల్ కూడా 'క్రేజీ ఫీలింగ్స్' అంటూ పెడుతున్నారట.

నేను శైలజ సినిమాలో తన పాటలోని పల్లవితో సినిమా టైటిల్ పెట్టేస్తున్నాడు రామ్. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవనుందట. మరి రామ్ ను క్రేజీ ఫీలింగ్స్ లో బంధిస్తున్న కరుణాకరణ్ సినిమాను ఏ రేంజ్ హిట్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ కూడా ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్స్ వచ్చేలా చేసింది.