
కరోనా లాక్ డౌన్ తర్వాత అక్టోబర్ నుండి థియేటర్లు తెరచుకునేలా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కేవలం 50 శాతం కెపాసిటీతోనే సినిమా హాళ్లు నడిపించాలని కండీషన్ పెట్టారు. ఇప్పటివరకు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే సినిమాలు నడుస్తూ వచ్చాయి. ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్రం ప్రకటించింది. లేటెస్ట్ గా తెలంగాణా ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
థియేటర్లలో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీని ఆమోదిస్తూ తెలంగాణా ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్సులు 100 శాతం సీట్లు నింపుకోడానికి అనుమతి ఇస్తున్నట్టు జీవో వచ్చింది. ఈ నిర్ణయంతో థియేటర్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు ఆనందంగా ఉన్నారు.