
జనతా గ్యారేజ్ హిట్ తో మరోసారి తన కెరియర్ మొదటి రోజులను గుర్తుచేస్తూ గర్జించిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పుడు ఆ సినిమా హిట్ తో మళ్లీ తన సత్తా ఏంటో చూపించాడు. తారక్ తీసుకున్న ఈ కొత్త టర్న్ ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేమికులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక తారక్ తర్వాత సినిమా విషయంలో ఇద్దరు దర్శకుల పోటీ మనకు తెలిసిందే.. వక్కంతం వంశీ, పూరి జగన్నాథ్.. తారక్ సై అంటే స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేందుకు రెడీగా ఉన్నాడు వక్కంతం వంశీ. కాని వంశీని మళ్లీ పక్కన పెట్టి ఈసారికి పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడట జూనియర్.
కళ్యాణ్ రాం నిర్మించబోతున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో రాబోతుంది. ఇక ఈ మధ్యనే తన బ్యానర్లో బాక్సర్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడట కళ్యాణ్ రాం. అయితే ఈ బాక్సర్ టైటిల్ పూరి, ఎన్.టి.ఆర్ సినిమా టైటిల్ అయ్యి ఉంటుందా అన్న సందేహం వస్తుంది. అయితే పూరి ఈసారి తారక్ ను నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో చూపించబోతున్నాడట. రాసుకున్న కథ ప్రకారం '420' అనే టైటిల్ పరిశీలన లో ఉందట. ఈ విధంగా చూసుకుంటే ఆ టైటిల్ కళ్యాణ్ రాం తన సినిమా టైటిల్ గా రిజిస్టర్ చేయించి ఉంటాడు.
ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ఇజం మూవీతో రాబోతున్న కళ్యాణ్ రాం సినిమాలో సరికొత్త స్టైల్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన పూరి, ఈసారి కళ్యాణ్ రాంను స్టార్ ను చేసే వరకు వదిలేలా లేడు. సో మొత్తానికి నందమూరి హీరోల్లో ఎవరో ఒకరు బాక్సర్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్నమాట.