
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా నైజాం రైట్స్ భారీ రేటుకి అమ్ముడయ్యాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ అదరగొడుతుండగా నైజాం రైట్స్ ను దిల్ రాజు దక్కించుకుంటారని అనుకోగా ఆయన బదులుగా వరంగల్ శ్రీను ఈ సినిమా నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు. స్టార్ సినిమా ఏదైనా నైజాం లో తనని దాటి వెళ్లదని దిల్ రాజు కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అయితే ఆచార్య మూవీ వరంగల్ శ్రీను తీసుకుని దిల్ రాజుకి షాక్ ఇచ్చాడు.
నైజాం రైట్స్ వరకు వరంగల్ శ్రీను 40 కోట్లకు కొనేశారని తెలుస్తుంది. 36 కోట్ల నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ తో ఈ డీల్ సెట్ చేసుకున్నారట. క్రాక్ సినిమా విషయంలో దిల్ రాజుపై విమర్శలు చేసాడు వరంగల్ శ్రీను. క్రాక్ ఆడుతున్న థియేటర్లలో తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ చేశాడని దిల్ రాజు మీద ఫైర్ అయ్యాడు. అయితే ఆచార్య మూవీని దిల్ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడిన వరంగల్ శ్రీను కే ఇవ్వడంతో అతనికి సపోర్ట్ దొరికినట్టు అయ్యింది.