ఫోర్బ్స్ అండర్ థర్టీ జాబిలో మహానటి..!

మహానటి సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆమె ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించింది. ఫోర్బ్స్ జాబితాలో థర్టీ అండర్ థర్టీ లో స్థానం దక్కించుకుంది కీర్తి సురేష్. ఫోర్బ్స్ 30 ఏళ్ల లోపు ప్రతిభావంతులైన 30 మందిలో 28 ఏళ్ల కీర్తి సురేష్ కూడా చోతు సంపాదించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ జాబితాలో ఉంచారు. 

కీర్తి సురేష్ ను ఎంటర్టైన్ మెంట్ విభాగంలో ఈ చోటు దక్కింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఫోర్బ్స్ థర్టీ అండర్ థర్టీ లో స్థానం దక్కించుకోడాన్ని గౌరవంగా భావిస్తున్నా.. ఫోర్బ్స్ ఇండియా సంస్థకు ధన్యవాదాములు అంటూ కీర్తి సురేష్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ నితిన్ తో రంగ్ దే సినిమా చేస్తున్న కీర్తి సురేష్ మహేస్ తో సర్కారు వారి పాట సినిమాలో కూడా నటిస్తుంది.