
బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ కోసం చాలామంది దర్శకులు అవకాశం కోసం ఎదురుచూశారు.. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కాని ఆ మూవీ పోవడంతో దర్శకుల పట్ల కాస్త జాగ్రత్త పడుతున్నాడు మహేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవంతో షాక్ ఇచ్చాడు అందుకే ఈసారి కథ కథనాలే కాదు దర్శకుడు కూడా తనకు నచ్చితేనే సినిమా ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ టైంలో బ్రహ్మోత్సవం నిర్మాత పివిపి వంశీ పైడిపల్లి డైరక్షన్లో మహేష్ తో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు.
మహేష్ బర్త్ డే నాడు పోస్టర్ వదిలారు. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా కొరటాల శివతో సినిమా అంటున్నారు. కాబట్టి మహేష్ సినిమా తీయాలంటే వంశీ ఎలా కాదన్నా మరో సంవత్సరం దాకా ఎదురుచూడాల్సిందే. ఈలోపు ఓ సినిమా తీసి రిలీజ్ చేసేయొచ్చు కూడా.. అఖిల్ సినిమా ఆఫర్ వచ్చినట్టే వచ్చి ఆగిపోవడంతో వంశీ పైడిపల్లి తీస్తే మహేష్ తోనే సినిమా తీయాలి అన్నట్టు పడిగాపులు కాస్తున్నాడట.
ఈ ఇయర్ ఊపిరి సినిమాతో హిట్ అందుకున్న వంశీ తన మీద పెట్టుకున్న నమ్మకానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడు. అయితే మహేష్ మాత్రం వంశీ సినిమా అంటే చిన్న చూపు చూస్తున్నట్టు తెలుస్తుంది. స్వతహాగా కథలను సిద్ధం చేయకపోవడం కూడా వంశీ డ్రా బ్యాక్ అని చెప్పొచ్చు.. కేవలం ఒకరు రాసిన కథను తెరకెక్కించడంలో వంశీ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.