
భీష్మ హిట్ తో కెరియర్ లో మంచి జోష్ లో ఉన్న నితిన్ ఓ పక్క వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. రంగ్ దే పాటుగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చెక్ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. చెక్ అంటూ వస్తున్న నితిన్ ఆమధ్య వచ్చిన టీజర్ తో మెప్పించగా లేటెస్ట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వి.ఆనంద్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. దేశద్రోహిగా ముద్రపడిన హీరో చెస్ లో ఎలాంటి చాంపియన్ అవుతాడు అన్నది సినిమా కథ. మనమంతా తర్వాత చంద్రశేఖర్ యేలేటి చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. లవర్ బోయ్ ఇమేజ్ కు దూరంగా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసే నితిన్ ఈ చెక్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.