పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత అటు క్రిష్ డైరక్షన్ లో సినిమాతో పాటుగా సాగర్ చంద్ర డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాడు పవర్ స్టార్. అయ్యప్పనుం కోషియం రీమేక్ కు నెల రోజులు డేట్స్ ఇచ్చాడట ఆలోగా సినిమా దాదాపు తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయమని చెప్పాడట. ఇక మరోపక్క క్రిష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కూడా రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది త్వరలో మరో షెడ్యూల్ జరుగనుంది.

ఇన్నాళ్లు రెగ్యులర్  కమర్షియల్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటిసారి పిరియాడికల్ మూవీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ దొంగగా కనిపిస్తాడని టాక్. ఈ సినిమాకు బందిపోటు, గజదొంగ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అయితే కొత్తగా ఈ సినిమాకు హరిహర వీరమల్లు, హర హర మహాదేవ్ అని రెండు టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండిటిలో క్రిష్ ఒక టైటిల్ సినిమాకు పెట్టబోతున్నారని తెలుస్తుంది. 

ఎన్.టి.ఆర్ జీవిత కథతో కథానాయకుడు, మహానాయకుడు సినిమా చేసిన క్రిష్ ఆ సినిమాల ఫలితాలతో కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. పవర్ స్టార్ సినిమాతో మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడూ చాడని పవన్ కళ్యాణ్ ను ఈ సినిమా చూస్తారని చిత్రయూనిట్ చెబుతున్నారు.