బయట ఇలా.. వెండితెర మీద అలా.. మెగా మేనియాకు ఫిదా అవ్వాల్సిందే..!

తెర మీద మెగాస్టార్ ను చూస్తే సినీ ప్రియులకు వచ్చే ఉత్సాహం ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక మెగా ఫ్యాన్స్ అయితే చిరంజీవి సినిమా కోసం చొక్కాలు సైతం చించుకుంటారు. మెగా మేనియాకు పదేళ్లు దూరంగా ఉన్న చిరు ఖైది నంబర్ 150తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. టైం గ్యాప్ అంతే టైమింగ్ లో గ్యాప్ లేదు అన్నట్టుగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ కత్తి రీమేక్ గా వస్తున్న ఖైదీ నంబర్ 150 మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించింది. 

ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఎన్నాళ్ల నుండో తన డ్రీం ప్రాజెక్ట్ గా అనుకుంటున్న సైరా నరసిం హా రెడ్డిని తీశారు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. సినిమా లాభ నష్టాల గురించి పక్కన పెడితే సైరా అంటూ చిరు తన సత్తా చాటారు. ఇక త్వరలో ఆచార్యగా మరో భారీ సినిమాతో రాబోతున్నారు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి టీజర్ రీసెంట్ గా రిలీజైంది.

టీజర్ లో చిరుని చూస్తే ఈతరం స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని గ్రేస్ ఫుల్ తో.. ఛార్మింగ్ గా కనిపించాడు. దాసరి తర్వాత సినీ పెద్దగా అన్ని సినిమాలకు తన సపోర్ట్ అందిస్తున్న చిరంజీవి బయట కొద్దిగా ఫిజిక్ తో కనిపించినా తెర మీద మాత్రం సర్ ప్రైజ్ లుక్ తో దర్శనమిస్తున్నాడు. ఆచార్య టీజర్ లో మిగతా మిగతా ఎలిమెంట్స్ అన్ని పక్కన పెడితే చిరు లుక్ మెగా ఫ్యాన్స్ కు కిక్ ఎక్కించింది. బయట అలా కనిపించే చిరంజీవిని సినిమాలో ఇలా చూపించడానికి బహుశా కెమెరా టెక్నిక్స్ ఉండేచ్చ్గేమో కాని మెగా ఫ్యాన్స్ కు మాత్రం చిరు లుక్ షాక్ ఇచ్చింది. మే 13న ఆచార్యగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు చిరంజీవి. మరి ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను ఏవిధంగా అలరిస్తుందో చూడాలి.