
సీనియర్ హీరోల్లో అందరు తమ జోరు కొనసాగిస్తుండగా కింగ్ నాగార్జున మాత్రం కొద్దిగా వెనకపడ్డారు. మన్మథుడు 2 ఇచ్చిన షాక్ కు మైండ్ బాల్ అవడంతో ఇక మీదట రిస్క్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యారు నాగార్జున. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 4 తో మరోసారి ప్రేక్షకులను అలరించిన నాగ్ వైల్డ్ డాగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సోలమన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా నాగార్జున నటిస్తున్నారు.
ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ఏంటని అనుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ తో వైల్డ్ డాగ్ టీం భారీ డీల్ సెట్ చేసుకుందట. అందుకే నాగ్ సినిమా డైరెక్ట్ ఓటిటి వస్తుందని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగార్జున సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా ఈ సినిమా వస్తుందని టాక్. అయ్తితే ఇది కాకుండా సోగ్గాడే చిన్ని నాయనా ప్రీ క్వెల్ గా బంగార్రాజు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట నాగార్జున.
కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సూపర్ హిట్ అయ్యింది. కొన్నాళ్లుగా ఈ సినిమాకు ప్రీ సీక్వల్ ప్లాన్ చేస్తుండగా త్వరలోనే ఆ సినిమాకు ముహుర్తం ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. సో మరోసారి అక్కినేని నాగార్జున సోగ్గాడిగా ఫ్యాన్స్ ను అలరిస్తాడని చెప్పొచ్చు.