
అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న క్రేజీ మూవీ పుష్ప. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ గా ఊర మాస్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈమధ్యనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వచ్చిన పోస్టర్ అదిరిపోయింది. ఆగష్టు 13న పుష్ప రిలీజ్ ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్ కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న సినిమాగా పుష్ప క్రేజ్ తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా నైజాం రైట్స్ అప్పుడే భారీ డీల్ కు అమ్ముడైనట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప నైజాం రైట్స్ 40 కోట్లకు సేల్ చేశారట. అల వైకుంఠపురములో 42 కోట్ల బిజినెస్ చేయగా ఆ సినిమా బీభత్సమైన వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు నైజాంలో పుష్ప కూడా 40 కోట్ల బిజినెస్ చేసింది. ఓరకంగా పుష్పకి ఇది భారీ డీల్ అని చెప్పొచ్చు. అంతేకాదు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.