
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ బిబి3 సెట్స్ మీద ఉంది. మిర్యాల రవింద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంపై క్లారిటీ రాలేదు. బిబి3 టీజర్ తో మెప్పించిన బాలయ్య సినిమా అప్డేట్స్ ఇవ్వడంలో మాత్రం వెనకపడ్డారు. కరోనా లాక్ డౌన్ కు ముందే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత నుండి ఎలాంటి అప్డేట్స్ బయటకు రానివ్వలేదు.
ఇక సంక్రాంతి సినిమాల హంగామా దాదాపు ముగిసిందనే చెప్పొచ్చు. అయితే ఫిబ్రవరి నుండి ఆగష్టు వరకు యువ హీరోల నుండి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ ఉప్పెన నుండి వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ సీక్వల్ ఎఫ్3 వరకు రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేశారు. అయితే ఇన్ని సినిమాల రిలీజ్ డేట్లు వచ్చినా సరే బాలయ్య సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఎనౌన్స్ చేయలేదు. మరి బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీ రిలీజ్ ఎప్పుడు వస్తుందో అని నందమూరి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.