
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా దర్శన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇచట వాహనములు నిలుపరాదు. సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. బైక్ చుట్టూ తిరిగే కథగా తెరకెక్కుతున్న ఇచట వాహనములు నిలుపరాదు సినిమా సుశాంత్ నుండి రాబోతున్న ది బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా సుశాంత్ ఖాతాలో మంచి ఫలితాన్ని అందిస్తుందని అంటున్నారు.
అల వైకుంఠపురములో సినిమాలో బన్నీతో ఓ స్పెషల్ రోల్ లో మెప్పించిన సుశాంత్ త్వరలోనే ఈ సినిమాతో రాబోతున్నాడు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. టీజర్ లో సుశాంత్ జోష్ బాగుంది. మరి అక్కినేని హీరో కోరుకునే హిట్టు సినిమాగా ఇచట వాహనములు నిలుపరాదు అవుతుందా లేదా అన్నది చూడాలి.