
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కె.జి.ఎఫ్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా చాప్టర్ 2 సెట్స్ మీద ఉంది. ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా జూలై 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు.
మే నుండి ఆగష్టు వరకు వరుస స్టార్ సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడబోతుంది. గత రెండు రోజులుగా వరుస స్టార్ సినిమాలన్ని రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా మే 13న వస్తుంది. నారప్ప సినిమాను మే 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేశారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 స్ట్రైట్ తెలుగు సినిమాలానే భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. జూలై 16న సింగిల్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవుతుంది.