పుష్ప స్టిల్ ఫోటోగ్రాఫర్ మృతి..!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప. మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విషాదం చోటుచేసుకుంది. సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్ జి.శ్రీనివాస్ (54) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి 1 గంటకు చాతినొప్పి రావడంతో శ్రీనివాస్ ను చిత్రయూనిట్ ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే శ్రీనివాస్ రావు మరణించారు.  

స్టిల్ ఫోటోగ్రాఫర్ గా శ్రీనివాస్ 200కి పెగా సినిమాలు చేశారు. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీనివాస్ తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారని సమాచారం. శ్రీనివాస్ మృతి పుష్ప టీం కు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ షాక్ తో సుకుమార్ పుష్ప సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.