
కోలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న నయనతార సినిమా చేస్తే హిట్ అనే పరిస్థితి ఉంది.. ఇక అడపాదడపా తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ ఇక్కడ అభిమానులను సంతోషపరుస్తున్న ఈ అమ్మడికి ఓ దర్శకుడు విలన్ అయ్యాడట. అదేదో రియల్ లైఫ్ లో అనుకునేరు రీల్ లైఫ్ లోనే లేండి.. తెలుగులో కూడా తమిళ డబ్బింగ్ సినిమాలతో అలరిస్తున్న నయనతార రీసెంట్ గా వచ్చిన బాబు బంగారం, ఇంకొక్కడు సినిమాల ఫలితాలతో సంతోషంగా ఉంది. ఇక అమ్మడు అదో జోష్ తో సినిమాలు చేస్తుంది.
ప్రస్తుతం నయనతార నటిస్తున్న సినిమా ఇమైక్కు నోడిగల్.. అధర్వ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఓకే అయ్యింది. అయితే ఈ సినిమాలో గౌతం మీనన్ విలన్ గా నటిస్తాడట. ఇప్పటికే దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించిన గౌతం, మొదటిసారి ఓ ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తున్నాడు.
తను తీసిన సినిమాలోనే ఎక్కడో ఓ చోట చిన్న రోల్ చేసే గౌతం, ఇప్పుడు విలన్ గా పూర్తిస్థాయిలో నటించడం గొప్ప విషయం. నయనతార హీరోయిన్ గా చేస్తుంది కాబట్టే తాను విలన్ గా ఒప్పుకున్నా అని అంటున్నాడట గౌతం మీనన్. డిమాంటి కాలని డైరక్టర్ అజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో దర్శకుడిగా ఉన్న గౌతం మీనన్ విలన్ గా మారడం ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది.