కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఉపాసన..!

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో లక్షలాది మంది మృత్యవాత పడ్డారు. మనదేశంలో కరోనా తీవ్రత తగ్గినా ఇప్పటికి కరోనా బారిన పడుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొన్ని చోట్ల వ్యాక్సిన్ వికటించడంతో ఈ టీకా వేయించుకోడానికి ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. అయితే వారికి ధైర్యం చెప్పేందుకు ముందుకొచ్చారు మెగా కోడలు కొణిదెల ఉపాసన.

అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్, బీ పాజిటివ్ మేగజైన్ ఎడిటర్ వ్యాక్సిన్ పై ఉన్న భయాలను పోగొట్టేందుకు అపోలో సిబ్బందితో కలిసి వ్యాక్సిన్ ను తీసుకున్నారు. వ్యాక్సిన్ పై ఎలాంటి భయాలు, అనుమానాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు ఉపాసన. మెగా హీరోల్లో చిరంజీవికి కరోనా పాజిటివ్ రాగా అది టెస్ట్ చేసిన కిట్ల ప్రభావం అని తెలిసింది.. తర్వాత ఆయనకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక రాం చరణ్, వరుణ్ తేజ్ లకు కరోనా పాజిటివ్ రాగా వారు హోం క్వారెంటైన్ లో ఉండటంతో పాటుగా తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా నుండి బయటపడ్డారు.