
యాంకర్ గా బుల్లితెర మీద తన సత్తా చాటుతున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన టాలెంట్ చూపిస్తుంది. వచ్చిన ప్రతి సినిమాను చేయకుండా ప్రత్యేకమైన కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ వెండితెర మీద కూడా స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంటుంది అనసూయ. లేటెస్ట్ గా అనసూయ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా థ్యాంక్ యు బ్రదర్. నిండు గర్భిణి లిఫ్ట్ లో ఒక తెలియని వ్యక్తితో ఉండిపోతే.. షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ లిఫ్ట్ సడెన్ గా ఆగిపోతే ఆ లిఫ్ట్ లో ఆమె పడిన బాధని సినిమాగా తెరకెక్కించారు.
ఈమధ్య తెలుగు సినిమాల్లో కొత్త కథలు బాగా వస్తున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు ఓటేస్తున్నారన్న లాజిక్ కనిపెట్టారు మేకర్స్. అందుకే ఈమధ్య సినిమాలన్ని కొత్త కాన్సెప్టులతో వస్తున్నాయి. వాటిలో భాగంగా థ్యాంక్ యు బ్రదర్ కూడా మంచి కాన్సెప్ట్ తో వస్తుంది. విక్టరీ వెంకటేష్ చేతుల మీదగా థ్యాంక్ యు బ్రదర్ ట్రైలర్ రిలీజ్ జరిగింది. యూనిక్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అన్నారు వెంకటేష్.