
వకీల్ సాబ్ తర్వాత క్రిష్ తో చేస్తున్న పిరియాడికల్ మూవీతో పాటుగా మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ ను చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. క్రిష్ సినిమాను రెండు షెడ్యూల్ పూర్తి చేసుకున్న పవన్ ఒక నెల గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పవన్, క్రిష్ కాంబో మూవీలో హీరోయిన్ గా ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న నిధి అగర్వాల్ ఆ తర్వాత క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా చేస్తున్న సినిమాలో అమ్మడు నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా అవకాశం దక్కించుకుందట. నిధి లుక్ టెస్ట్ చెసి మరి ఈ సినిమాలో సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ తో స్క్రీన్ షేరింగ్ అంటే నిధికి లక్కీ ఛాన్స్ అన్నట్టే. తప్పకుండా ఆమె కెరియర్ కు ఇది మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.