సలార్ లో శృతి.. క్రాక్ డైరక్టర్ లీక్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ అంటూ ఓ సెన్సేషనల్ మూవీ రాబోతుంది. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కాగానే సలార్ మీద ఫోకస్ పెట్టనున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా రాధే శ్యాం ను పూర్తి చేసి ఆదిపురుష్, సలార్ రెండిటిని ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. కె.జి.ఎఫ్ సినిమా బంగారు గనుల్లో తీసిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్ భామ శృతి హాసన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సలార్ లో శృతి చర్చల దశల్లో ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు శృతి పుట్టినరోజు సందర్భంగా క్రాక్ డైరక్టర్ శృతికి బర్త్ డే విష్ చేస్తూ సలార్ కు ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. అఫీషియల్ గా చెప్పలేదు కాని ప్రభాస్ సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా ఫిక్స్ అన్నమాట. కొన్నాళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శృతి హాసన్ క్రాక్ తో హిట్ అందుకోగా వకీల్ సాబ్ లో పవన్ కు జోడీ కట్టింది. ఇప్పుడు ప్రభాస్ సలార్ లో కూడా ఛాన్స్ పట్టేసింది. శృతి హాసన్ తిరిగి ఫాం లోకి వచ్చిందని చెప్పడానికి ఈ వరుస సినిమాలే నిదర్శనం.