అల్లు అర్జున్ 'పుష్ప' రిలీజ్ డేట్ లాక్.. సుకుమార్ ఇలా షాక్ ఇచ్చాడేంటి..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్ తో అల్లు అర్జున్ కనిపించనున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. లాస్ట్ ఇయర్ నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా మారేడుమిల్లిలో రెగ్యులర్ షూట్ జరుపుకుంటుంది.

కేరళలో ఒక షెడ్యూల్, హైదరాబాద్ లో మరో షెడ్యూల్ తో సినిమా పూర్తి అవుతుందని తెలుస్తుంది. సుకుమార్ సినిమా అంటే షూటింగ్ అనుకున్న విధంగా జరగదు. కాని పుష్ప సినిమా విషయంలో ఎలాంటి లేట్ చేయకుండా అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నారట. అందుకే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా పూర్తవుతుందా అని డౌట్ పడితే ఏకంగా ఆగష్టు 13న రిలీజ్ డేట్ ప్రకటించి షాక్ ఇచ్చారు చిత్రయూనిట్.

సుకుమార్, అల్లు అర్జున్ ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ అవుతున్న పుష్ప ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.