ప్రదీప్ సినిమా ఎంత బిజినెస్ చేసిందంటే..?

బుల్లితెర మీద తన యాంకరింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన ప్రదీప్ హీరోగా చేస్తున్న మొదటి ప్రయత్నం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మున్నా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన కోలీవుడ్ భామ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 29న రిలీజ్ అవుతున్న ప్రదీప్ సినిమా 4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

30 రోజుల్లో ప్రేమించడం ఎలా హిట్ అవ్వాలంటే 4.5 కోట్ల రూపాయల రాబట్టాలి. ప్రదీప్ కు బుల్లితెర మీద ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే మాత్రం ఇదేమంత పెద్ద టార్గెట్ కాదు. రెండు మూడు రోజుల్లో ప్రదీప్ ఈ టార్గెట్ అందుకుంటాడని చెప్పొచ్చు. ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? బిజినెస్ అదరగొట్టగా బిజినెస్ కు తగినట్టుగా వసూళ్లు రాబడుతుందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.