'ఆచార్య' టీజర్ అప్డేట్ వచ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో మెగా మూవీగా వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నుంచి ఇప్పటివరకు టైటిల్ పోస్టర్ మాత్రమే వచ్చింది. ఆచార్య టీజర్ గురించి మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా చిరు రిక్వెస్ట్ తో కొరటాల శివ ఆచార్య టీజర్ అప్డేట్ ఇచ్చారు.

ఈ నెల 29న సాయంత్రం 4:05 గంటలకు ధర్మస్థలి డోర్స్ ఓపెన్ అవుతాయని చిత్రయూనిట్ ప్రకటించింది. టీజర్ నుంచే ఆచార్యతో రికార్డులు కొట్టాలని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. చిరుతో పాటుగా రాం చరణ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. ఆచార్య సినిమాలో చరన్ సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. సినిమా టీజర్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ ఇయర్ సమ్మర్ లో ఆచార్య ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తుంది.