వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' అఫీషియల్ రిలీజ్ డేట్..!

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనకు ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫాం చేశారు మేకర్స్. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సినిమాపై సూపర్ క్రేజ్ తెచ్చింది. 

సాంగ్స్ తో యూత్ ఆడియెన్స్ ను మెప్పించిన ఈ ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ పై కొన్నాళ్లుగా కన్ ఫ్యూజన్ ఉంది. ఫైనల్ గా ఈ కన్ ఫ్యూజన్ కు తెరదించుతూ నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ప్రేమకథతో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ అలరించనుంది. ఈ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ విజయ్ సేతుపతి. అతను విలన్ గా నటించడమే సినిమాకు అదనపు ఆకర్షణ అని అంటున్నారు.

అంతేకాదు సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను టచ్ చేస్తుందని చిత్రయూనిట్ చెబుతుంది. ఈ సినిమాలో నటించిన హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరు మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కెరియర్ లో ఫుల్ బిజీ అయ్యారు.