ఆస్కార్ బరిలో సూర్య 'ఆకాశమే నీ హద్దురా'..!

2020 లాక్ డౌన్ టైంలో రిలీజైన సినిమా సూర్య ఆకాశమే నీ హద్దురా. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలో సూరారై పొట్రు టైటిల్ తో వచ్చింది. తమిళ వర్షన్ మాత్రమే కాదు తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు భారత్ నుంచి ఆస్కార్ బరిలో ఈ సినిమా పోటీ పడుతుందని తెలుస్తుంది. 

ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు విభాగాల్లో సూరారై పొట్రు సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందట. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కథా రచయిత విభాగాల్లో ఈ సినిమా పోటీ పడుతుంది. ఆస్కార్ స్క్రీనింగ్ రూం లో ఈరోజు నుంచి సూర్య సినిమా ప్రదర్శన కాబోతుంది. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ నిజ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. తెలుగులో ఆకాశమే నీ హద్దురాగా రిలీజై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.