
అదేంటి క్రాక్ ఆల్రెడీ రిలీజై సూపర్ హిట్ అయ్యిందిగా.. మాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ క్రాక్. మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఉండటంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో రవితేజ క్రాక్ బంపర్ హిట్ అందుకుంది. అయితే క్రాక్ థియేట్రికల్ వర్షన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది ఇప్పుడు డిజిటల్ వర్షన్ రిలీజ్ కు టైం అయ్యింది. రవితేజ క్రాక్ ను ఆహా ఓటిటి కొనేసింది. ఫ్యాన్సీ ప్రైజ్ ఇచ్చి ఈ సినిమాను ఆహా కొన్నదని తెలుస్తుంది.
జనవరి 29న ఆహాలో క్రాక్ స్ట్రీమింగ్ ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పటికి థియేటర్లో క్రాక్ మంచి వసూళ్లు రాబడుతుంది. అందుకే క్రాక్ దర్శక నిర్మాతల కోరిక మేరకు క్రాక్ డిజిటల్ వర్షన్ ను మరో వారం వాయిదా వేశారు. ఫిబ్రవరి 5న ఆహాలో క్రాక్ రిలీజ్ అవుతుంది. అదే డేట్ న కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ కూడా అమేజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ అవుతుంది. సో క్రాక్, మాస్టర్ సినిమాల మధ్య వార్ అక్కడ కూడా కొనసాగుతుంది.