పేరుకే సాగర్ చంద్ర.. నడిపించేది మొత్తం ఆయనే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాటుగా మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా సినిమా చేస్తున్నాడు. ఈ రీమేక్ లో పవన్ తో పాటుగా దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నా డైలాగ్స్, స్క్రీన్ ప్లే త్రివిక్రం రాస్తున్నారు. సోమవారం మొదలైన రిపబ్లిక్ డే కానుకగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. పవన్ షూటింగ్ స్పాట్ కు రావడం.. అక్కడ డిస్కషన్స్.. ఫైనల్ గా డైరక్టర్ సాగర్ చంద్ర యాక్షన్ చెప్పడం ఈ వీడియోలో ఉంది. డైరక్టర్ గా సాగర్ చంద్ర యాక్షన్ అని చెప్పినా సినిమా నడిపించేది మొత్తం త్రివిక్రం అని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. త్రివిక్రం చెప్పాడు కాబట్టే పవన్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది. మొత్తానిమి ఏకే రీమేక్ షురూ అయ్యింది. విశేషం ఏంటంటే ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే వకీల్ సాబ్ తో పాటుగా పవార్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ ఇయర్ ఈ సినిమా కూడా కానుకగా ఇవ్వనున్నారు.