
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే అంతకుమించిన లక్కీ ఆఫర్ ఇంకోటి లేదంటూ హీరోయిన్స్ ఫీల్ అవుతుంటారు. కాని పవన్ ఆఫర్ తో తలనొప్పిగా మారిందని శృతి హాసన్ అనుకుంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డాలి డైరక్షన్లో వస్తున్న సినిమా కాటమరాయుడు. ఈ సినిమాలో పవన్ తో శృతికి జోడి కట్టే ఛాన్స్ వచ్చింది. రేణు తర్వాత రెండో సారి శృతికే ఆ ఛాన్స్ దక్కిందని సంతోష పడింది. కాని పవన్ సినిమాకు చేస్తున్న లేట్ పట్ల ఆమె అసంతృప్తిగా ఉందట.
ఇప్పటికే మొదటి షెడ్యూల్ మొత్తం పవన్ కళ్యాణ్ లేకుండానే కానిచ్చేశారు. ఇక తర్వాత షెడ్యూల్ కు శృతి డేట్స్ ఇచ్చింది. తీరా చూస్తే పవన్ జనసేన సభలతో బిజీగా ఉన్నాడు. పవన్ సినిమాతో మరోసారి టాలీవుడ్లో తన సత్తా చాటాలనుకున్న శృతికి ఈ సినిమా పెద్ద హెడేక్ గా మారిందట. ఇప్పటికే ఇచ్చిన డేట్స్ అన్ని వేస్ట్ చేస్తున్నారని వాపోతుంది. ఇక ఇదే క్రమంలో ఇంకా సినిమా లేట్ పట్టేట్టు ఉంటే సినిమా నుండి బయటకు వచ్చే ఆలోచన కూడా చేస్తుంది.
కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న శృతి హాసన్ లాస్ట్ ఇయర్ వచ్చిన శ్రీమంతుడు తర్వాత ఏ సినిమా చేయలేదు. మలయాళ రీమేక్ ప్రేమం తెలుగు వర్షన్లో నటిస్తున్న శృతి, తెలుగు సినిమాల కన్నా తమిళ హింది సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఆల్రెడీ ఊపిరి సినిమా గొడవతో టాలీవుడ్ కు దూరమైన శృతి హాసన్ పవన్ కళ్యాణ్ సినిమా నుండి కూడా తొలగిపోతే ఇక అమ్మడికి తెలుగు సినిమా ఆఫర్లు కష్టమే అంటున్నారు.