మహేష్ సినిమా వంద కోట్లు గ్యారెంటీ అట..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది.. రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ముందు 70 కోట్ల దాకా ఉంటుందని అన్నారు. తీరా సినిమా మొదలు పెట్టేసరికి అది కాస్త 80 నుండి 90 దాకా పట్టొచ్చని అన్నారు. అయితే రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కొత్తగా సినిమా బడ్జెట్ వంద కోట్లు గ్యారెంటీ అంటున్నారట.

మురుగదాస్ మహేష్ లకు ఉన్న మార్కెట్ కు వంద కోట్ల బడ్జెట్ పెట్టేయొచ్చు కాకపోతే సినిమా ఏదన్నా తేడా కొడితే మాత్రం దెబ్బపడ్డట్టే. అసలే అంచనాలతో రిలీజ్ అయిన మురుగదాస్ బాలీవుడ్ మూవీ అకిరా నిరాశే కలిగించింది. అయినా సరే మహేష్ సినిమా మాత్రం రికార్డులు బద్దలవడం గ్యారెంటీ అనేస్తున్నారు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్ ఇంతకుముందు సినిమాల కన్నా అద్భుతంగా ఉంటుందట. అంతేకాదు మురుగదాస్ కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాలనే తన కసి తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడట.

ముగిసిన రెండు షెడ్యూళ్లతో సినిమా హిట్ కళ వచ్చేసిందని అంటున్నారు. సినిమాకు టెక్నికల్ టీం కూడా మంచి వారే కావడం చేత, అవుట్ పుట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ తో వచ్చిన బ్యాడ్ ఇమేజ్ ను ఈ సినిమాతో చెరిపేయాలని చూస్తున్నాడు. మరి అనుకున్నట్టు అంచనాలను మించే సినిమా అవుతుందో లేదో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.