మెగా హైప్ కోసమే ఈ ప్రయత్నమంతా..!

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి, ప్రేక్షకుల్లో ఓ ఉత్సాహం నింపేందుకు ప్రతి విషయం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో చిరుని మరింత ప్రేక్షకులకు దగ్గర చేసే క్రమంలో మీలో ఎవరు కోటిశ్వరుడు సినిమాకు కూడా నాలుగో సీజన్లో చిరు హోస్ట్ గా చేయనున్నాడు. గడిచిన మూడు సీజన్లలో కింగ్ నాగార్జున ఓ రేంజులో ఆడియెన్స్ ను అలరిస్తే ఇదే ప్రోగ్రాంతో ఇప్పుడు చిరు బుల్లితెర మీద సందడిచేయనున్నారు.  

ఎం.ఈ.కెలో చిరు ఎంట్రీ ఇవ్వడం ఆ ప్రోగ్రాం రేంజ్ పెరిగిందంటూ నాగ్ చెప్పడం విశేషం. నాగార్జున ఈ విషయంలో మరింత చొరవ చూపించి ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యేలా చిరుని ఎం.ఈ.కె హోస్ట్ గా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇదో విధంగా సినిమా పబ్లిసిటీ కోసం ఉపయోగపడే మార్గమని అనుకున్నా సినిమా కలక్షన్స్ మీద కూడా ఈ ప్రోగ్రాం ద్వారా భారీ ప్రభావితం చూపేలా ప్లాన్ చేస్తున్నారట.

వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తమిళ కత్తి సినిమా రీమేక్ అన్నది తెలిసిన విషయమే. చిరు హిట్ సెంటిమెంట్ ఖైది టైటిల్ తో వచ్చేలా ఖైది నెంబర్ 150గా రాబోతున్న మెగాస్టార్, ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా కేథరిన్ త్రెసా స్పెషల్ ఐటం సాంగ్లో కనిపించనుంది.