
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పుడు వరుస సినిమాలను హిట్లుగా మలచుకుంటూ స్టార్స్ గా వీరి ప్రతాపం బాక్సాఫీస్ దగ్గర చూపెట్టేస్తున్నారు. హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్న ఈ ఇద్దరి హీరోలు ఇప్పుడు ఒకరి కథను మరొకరు చేస్తున్నారని టాక్.. ఇంతకీ ఎవరి కథను ఎవరు తీసుకున్నారు అంటే.. సన్నాఫ్ సత్యమూర్తి కన్నా ముందు తమిళ దర్శకుడు లింగుస్వామితో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. మరి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు.. తాజాగా సరైనోడు తర్వాత బన్ని కన్ఫాంగా లింగుస్వామితోనే అంటూ హడావిడి చేశారు.
కట్ చేస్తే బన్ని హరీష్ శంకర్ తో డిజె దువ్వాడ జగన్నాథం అనే సినిమా చేస్తున్నాడు. అయితే బన్ని మీద హోప్స్ పెట్టుకున్న లింగుస్వామి ఇక అతన్ని వదిలి తారక్ మీద కన్నేశాడట. యంగ్ టైగర్ కూడా ఇప్పుడు రోరింగ్ హిట్స్ సాధిస్తున్నాడు. మళ్లీ ఫాంలోకి వచ్చిన తారక్ తన తర్వాత సినిమా వక్కంతం వంశీ అని చాటింపేసి మరి చెప్పినా అది మళ్లీ అటకెక్కేసిందని అంటున్నారు.
ఇక తారక్ సినిమా రేసులో పూరి కూడా ఉన్నాడు.. అయితే వీరెవరు కాకుండా ఇప్పుడు కొత్తగా లింగుస్వామి తో జూనియర్ సినిమాకు రెడీ అవుతున్నాడని టాక్. ఇప్పటికే లింగుస్వామి కథ చెప్పడం జూనియర్ ఓకే చేయడం అంతా జరిగిందట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బన్ని కోసం రాసిన ఆ కథతోనే ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు లింగుస్వామి. మరి క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.