క్రాక్ డైరక్టర్ కు 'మెగా'భినందనలు..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన సినిమా క్రాక్. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజైన ఈ సినిమా సూపర్ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ కూడా చిత్రయూనిట్ ను మెచ్చుకుంటున్నారు. ఆ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. క్రాక్ సినిమా చూసిన చిరు రవితేజ, డైరక్టర్ గోపీచంద్ లకు ఫోన్ చేసి మరీ అభినందించారట. 

ఇక డైరక్టర్ గోపీచంద్ మలినేనిని ఇంటికి పిలిపించుకుని మరి చిరు తన అభినందనలు తెలిపినట్టు తెలుస్తుంది. కేవలం డైరక్టర్ ను క్రాక్ గురించి ప్రశంసించడానికే పిలిచాడా తనకు ఓ మాస్ కథ సిద్ధం చేయమని చెప్పారా అన్నది తెలియాల్సి ఉంది. డైరక్టర్ గోపీచంద్ మాత్రం చిరుతో తను కలిసి దిగిన పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఈరోజు తనకు మెగా డే అని అన్నారు. మెగాస్టార్ అభినందనలు సినిమా కమర్షియల్ సక్సెస్ కు నిదర్శనమని.. చిరుతో గడిపే కొంత టైంలోనే ఏదో ఒకటి నేర్చుకోవచ్చని గోపీచంద్ కామెంట్ పెట్టారు.