పూజా హెగ్దేకి కోలీవుడ్ ఛాన్స్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పేది బుట్ట బొమ్మ పూజా హెగ్దే పేరే. మొదట్లో చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా అల్లు అర్జున్ డీజే తర్వాత అమ్మడి దశ తిరిగిపోయింది. ఇప్పుడు స్టార్ సినిమా అంటే అందులో పూజా హెగ్దే హీరోయిన్ గా ఉండాల్సిందే. ఆమె కాదన్న తర్వాత వేరే హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నారు. తెలుగులో ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దేకి కోలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ 2012లో మూగముడి సినిమాలో నటించిన పూజా హెగ్దే ఆ సినిమా తర్వాత అక్కడ పెద్దగా అవకాశాలు అందుకోలేదు. అయితే తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లడంతో తమిళ దర్శక నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారు. ఈ క్రమంలో దళపతి విజయ్ నెక్స్ట్ సినిమాలో పూజాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మాస్టర్ తర్వాత విజయ్ హీరోగా నెల్సన్ డైరక్షన్ లో సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫిక్స్ చేశారట. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన తమిళ ఆఫర్ కాబట్టి పూజా హెగ్దే కూడా భారీగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది.