
ఒకప్పుడు సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ క్యాలెండర్ ఫుల్ గా షెడ్యూల్ ఉండే అల్లారి నరేష్ ఈమధ్య కెరియర్ లో పూర్తిగా వెనకపడ్డాడు. తను చేసే కామెడీ సినిమాలు బోర్ కొట్టడమే కాకుండా యువ హీరోలంతా అదే దారిలో వెళ్లడంతో అల్లరోడి సినిమాల మీద ఎఫెక్ట్ పడ్డది. నెల రోజుల్లో సినిమా.. రెండు మూడు కోట్ల బడ్జెట్.. ఐదారు కోట్ల ప్రాఫిట్స్ ఇలా సాగిపోతున్న అల్లరి నరేష్ కెరియర్ పూర్తిగా ట్రాక్ తప్పింది. అందుకే కొద్దిపాటి గ్యాప్ తీసుకుని మునుపటి ఎనర్జీతో వస్తున్నాడు అల్లరి నరేష్.
సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించిన అల్లరి నరేష్ లేటెస్ట్ గా గిరి డైరక్షన్ లో బంగారు బుల్లోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై మంచి బజ్ ఏర్పరచుకుంది. సినిమా ట్రైలర్ చూస్తుంటే అల్లరోడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే అనిపిస్తుంది. బంగారు బుల్లోడు సినిమాలో అల్లరి నరేష్ సరసన పూజా ఝవేరి హీరోయిన్ గా నటించింది. ఈ నెల 23న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.