క్రాక్ వసూళ్ల హంగామా..!

మాస్ మహరాజ్ రవితేజ గోపీచ మలినేని డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా కొన్నాళ్లుగా మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే మూవీగా క్రాక్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే ఈ సినిమా వసూళ్లు అదరగొడుతున్నాయి. ఈ సినిమా రిలీజై తొమ్మిది రోజులకు 23.63 కోట్ల వసూళ్లను రాబట్టింది.

మొదటి రోజు ఆరున్నర కోట్ల షేర్ రాబట్టిన క్రాక్ వీక్ డేస్ లో కూడా వసూళ్లతో దూసుక్ళ్తుంది. క్రాక్ సినిమాను 17 కోట్ల థియేట్రికల్ రైట్స్ తో రిలీజ్ చేయగా ఇప్పటికే అన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్స్ లాభాల బాట పట్టారని తెలుస్తుంది. రవితేజ నుండి కోరుతున్న అసలు సిసలైన మాస్ సినిమాగా మాస్ మహరాజ్ రవితేజ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమాగా క్రాక్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సంక్రాంతికి వచ్చిన రెడ్, మాస్టర్, అల్లుడు అదుర్స్ కలక్షన్స్ విషయంలో వెనకపడగా రవితేజ క్రాక్ దూసుకెళ్తుంది.