పుష్పలో మరో స్టార్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న ఉప్పెన సినిమా మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న పుష్ప సినిమాని అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేశాడట సుకుమార్. రంగస్థలం హిట్ తో సుకుమార్, అల వైకుంఠపురములో సూపర్ హిట్ తో అల్లు అర్జున్ ఇద్దరు సూపర్ ఫాం లో ఉన్నారు. అందుకే ఈ ఇద్దరు కలిసి మరో సెన్సేషనల్ మూవీగా పుష్పని నిలబెట్టాలని ఫిక్స్ అయ్యారు. 

ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో తమిళ స్టార్ హీరోని తీసుకోవాలని చూస్తున్నారట. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం కోలీవుడ్ హీరో శింబు ఈ పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని అతనితో చర్చలు జరుపుతున్నట్టు టాక్. తమిళంలో స్టార్ హీరో అయిన శింబు తెలుగులో మన్మథ టైం లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శింబు సినిమాలు తెలుగులో రిలీజ్ అవలేదు. మరి పుష్ప సినిమాలో అతని పాత్ర నచ్చితే తప్పకుండా శింబు ఓకే చెప్పే ఛాన్సులు ఉన్నాయి. అల్లు అర్జున్, శింబు ఈ కాంబో స్క్రీన్ పై సూపర్ గా ఉంటుంది. అది వర్క్ అవుట్ అవుతుందా కాదా అన్నది త్వరలో తెలుస్తుంది.