విజయ్ దేవరకొండ 'లైగర్'..!

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబో సినిమా అనగానే ఇద్దరు డ్యాషింగ్ కాంబినేషన్ లో సినిమా క్రేజీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా లైగర్ అంటూ వస్తున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ కు అలాంటి హీరోనే దొరికితే సినిమా ఎలా ఉంటుందో ఈ లైగర్ అలా ఉండబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ హేశారు. లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ అంటూ విజయ్ దేవరకొండ బాక్సింగ్ గ్లౌసెస్ వేసుకుని ఉన్న పోస్టర్ వదిలారు.

వెనక లయన్, టైగర్ రెండు ఉన్నాయి. మొత్తానికి కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న లైగర్ టైటిల్ నే విజయ్ దేవరకొండకు ఫిక్స్ చేశాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. పోస్టర్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచిన పూరీ నేషనల్ వైడ్ మ్యాడ్ నెస్ పక్కా అని విజయ్ దేవరకొండ ప్రామిస్ చేస్తున్నాడు.