పవన్, రానా కోసం త్రివిక్రం..!

మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర డైరక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నట్టు తెలుస్తుంది. మళయాళ కథకు త్రివిక్రం డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇస్తే సాగర్ చంద్ర కేవలం డైరక్షన్ మాత్రమే చేస్తున్నారని తెలుస్తుంది. అంటే పేరుకే డైరక్టర్ గా సాగర్ చంద్రని పెట్టి మిగతా కథ అంతా త్రివిక్రం నడిపిస్తున్నారని అర్ధమవుతుంది.

అసలు ఈ సినిమా రీమేక్ చేయమని పవన్ కు రిఫర్ చేసింది త్రివిక్రమే అని అంటున్నారు. అందుకే త్రివిక్రం ఈ సినిమా బాధ్యతలను తీసుకున్నారట. మళయాళంలో బిజూ మీనన్, పృధ్విరాజ్ నటించిన అయ్యప్పనుం కోవ్షియం సినిమా తెలుగు వర్షన్ వేరే లెవల్ లో ఉంటుందని అంటున్నారు. పవన్ రంగంలోకి దిగాడు ఆ తర్వాత రానా వచ్చాడు.. ఇక ఇప్పుడు త్రివిక్రం కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నాడని అఫీషియల్ గా చెప్పేశారు. కాబట్టి ఏకే రీమేక్ అంతకుమించి అనిపించేలా ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు.